Azharuddin:మహ్మద్ షమీ రిటైర్మెంట్ బాధాకరం.. అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై తెలంగాణ మంత్రి, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. షమీ రిటైర్మెంట్ బాధాకరమైన విషయమని, అయితే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు. దేశం కోసం షమీ ఎంతో సేవ చేశారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్.. ఒక ఆటగాడు ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానులకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఆటగాళ్లు మైదానంలో ఆడటం చూసి అలవాటు పడిపోతామని అలాంటి...