Kavitha:నల్గొండకు గోదావరి జలాలే శాశ్వత పరిష్కారం..దిండి ప్రాజెక్టు పరిశీలన
నల్గొండ జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యతో పాటు సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలంటే గోదావరి జలాలను జిల్లాకు తరలించాల్సిందేనని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఆధారపడటం వల్ల నల్గొండకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదని విమర్శించారు. దిండి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కృష్ణా జలాలపై ఆధారపడితే ప్రయోజనం లేదు కృష్ణా నదిలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిందని కవిత పేర్కొన్నారు....