Ind Vs NZ:రెండో వన్డేలో టీమిండియా గెలుపు..4 పరుగుల తేడాతో విక్టరీ

న్యూజిలాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) పద్ధతిలో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని మరింత మెరుగుపరుచుకుంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో...