HBD Revanth Reddy:పోరాటమే పునాది.. పట్టుదలే ప్రస్థానం.. ప్రజా నాయకత్వమే లక్ష్యం!

రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తయితే.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం మరో ఎత్తు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఒక సవాలైతే.. ఎన్నో ఆటుపోట్లను అధిగమించి రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం అసాధారణమైన ప్రయాణం. అలాంటి ప్రయాణానికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఒక నాయకుడి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించేటప్పుడు ఆయన అధిరోహించిన పదవులనే కాదు.. ఆ పదవుల వెనుక ఉన్న పోరాటాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని కూడా విశ్లేషించాలి. ఆ కోణంలో చూస్తే రేవంత్...