STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 5:40 pm Posted by : ARUN

HBD Revanth Reddy:పోరాటమే పునాది.. పట్టుదలే ప్రస్థానం.. ప్రజా నాయకత్వమే లక్ష్యం!

రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తయితే.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం మరో ఎత్తు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఒక సవాలైతే.. ఎన్నో ఆటుపోట్లను అధిగమించి రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం అసాధారణమైన ప్రయాణం. అలాంటి ప్రయాణానికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
ఒక నాయకుడి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించేటప్పుడు ఆయన అధిరోహించిన పదవులనే కాదు.. ఆ పదవుల వెనుక ఉన్న పోరాటాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని కూడా విశ్లేషించాలి. ఆ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి ప్రస్థానం నేటి రాజకీయాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించదగినది.

గ్రామీణ నేపథ్యం నుంచి రాజకీయ యవనికపైకి..

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు. గీతా రెడ్డిని వివాహం చేసుకున్న ఆయనకు నైమిషా రెడ్డి అనే కుమార్తె ఉన్నారు. రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచారు. విద్యార్థి సంఘం రాజకీయాల నుంచి మొదలైన ఆయన ప్రస్థానం క్రమంగా ప్రజా ఉద్యమాలు, స్థానిక సంస్థలు, శాసనమండలి, శాసనసభ, పార్లమెంటు మీదుగా ముఖ్యమంత్రి పీఠం వరకు చేరింది. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీగా విజయం సాధించడం ఆయన రాజకీయ జీవితంలో తొలి కీలక అడుగు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనలోని రాజకీయ నాయకత్వ సామర్థ్యానికి తొలి గుర్తింపు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి కొడంగల్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఓటమి ఎదురైనా ఆగని అడుగులు.. విమర్శలెదురైనా తగ్గని పట్టుదల!

రాజకీయాల్లో విజయాల కంటే ఎదురుదెబ్బలే నాయకుడి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా పరీక్షిస్తాయి. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఎదురైన ఓటమి ఒక పెద్ద రాజకీయ సవాలు. కానీ ఆ ఓటమి ఆయన రాజకీయ ప్రయాణానికి ముగింపు కాలేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, మరింత పట్టుదలతో ప్రజల్లోకి వెళ్లారు. 2019లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి తన రాజకీయ పునరాగమనాన్ని చాటుకున్నారు. ఇక్కడే ఒక నాయకుడిలోని అసలైన పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే నాయకత్వం వహించడం కాదు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగడమే నిజమైన నాయకత్వ లక్షణం.

పార్టీకి పునరుత్తేజం.. కార్యకర్తల్లో కొత్త విశ్వాసం!

2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ముందున్నది సాధారణ బాధ్యత కాదు. క్షేత్రస్థాయిలో బలహీనపడిన పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లడం, నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడం, నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, అధికార పార్టీ విధానాలను ప్రశ్నించడం, నిరంతరం ప్రజల్లో ఉండటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా కొత్త ఊపునిచ్చారు. ఒక పార్టీకి నాయకత్వం వహించడం అంటే కేవలం ప్రసంగాలు చేయడం కాదు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించడం, నాయకులను సమన్వయం చేయడం, ప్రజల ఆకాంక్షలకు రాజకీయ స్వరం ఇవ్వడం. ఈ అంశాల్లో రేవంత్ రెడ్డి తనదైన శైలిని ప్రదర్శించారు.

2023 విజయం.. ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, నాయకత్వానికి లభించిన గుర్తింపు!

తెలంగాణ రాజకీయ చరిత్రలో 2023 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, వ్యూహరచన, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. కొడంగల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, డిసెంబర్ 7, 2023న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన వ్యక్తి.. అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వెనుక రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం, అనేక సవాళ్లు, నిరంతర ప్రయత్నం ఉన్నాయి. ముఖ్యమంత్రి కావడం ఒక రాజకీయ మైలురాయి మాత్రమే. ఆ పదవిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంతకంటే పెద్ద బాధ్యత. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు ఇండ్లు లేని పేదవారికి ,ఇందిరమ్మా ఇండ్లు. రైతులకు కాలంలో రుణమాఫీ వారి సమస్యలు తీర్చుటకై రైతు కేంద్రాలు , యువతకు ఉపాధి, విద్య, వైద్యం, మహిళా ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యున్నతి పై ప్రణాళికలు . ఇవన్నీ ప్రభుత్వ పనితీరును నిర్ణయించే కీలక అంశాలు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి నిజమైన కొలమానం ప్రజల జీవితాల్లో తీసుకొచ్చే సానుకూల మార్పులే. రాజకీయ విజయాన్ని పాలనా విజయంగా మలచడం, అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు చేర్చడం, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ముందున్న చారిత్రక బాధ్యత. రేవంత్ రెడ్డిలోని రాజకీయ చొరవ, పట్టుదల, పోరాట పటిమ, నిర్ణయాత్మక నాయకత్వం తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ఆయన భవిష్యత్ ప్రస్థానానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.

సీఎం జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా..

నా రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై ఉన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్న ఒక కార్యకర్తగా..జిల్లా అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని గర్వంగా చూస్తున్నాను. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పాలనా బాధ్యత వరకు సాగిన ఆయన ప్రయాణం ఎంతోమంది నాలాంటి యువ రాజకీయ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం. రాజకీయాల్లో కష్టపడితే, పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే నమ్మకాన్ని ఈ ప్రస్థానం కలిగిస్తోంది. ఈ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్యాలతో, మరింత శక్తిసామర్థ్యాలతో తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు భారతదేశ నికి దశ దిశ కావాలని ఆకాంక్షిస్తున్నాను.

జై కాంగ్రెస్.. జై తెలంగాణ..!

మహ్మద్ అయూబ్
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
9908465789