Kodangal:సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వలస కూలీల ఆందోళన.. కూలి డబ్బుల కోసం నిరసన!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో వలస కూలీలు ఆందోళనకు దిగారు. తాము పనిచేసిన కూలి డబ్బులను KLSR కన్స్ట్రక్షన్స్ సంస్థ చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సమీపిస్తున్నప్పటికీ తమకు రావాల్సిన వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో నిర్మిస్తున్న ఎడ్యుకేషనల్ హబ్ పనుల్లో పలువురు వలస కూలీలు పనిచేస్తున్నారు. ఈ నిర్మాణ పనులను చేపడుతున్న KLSR కన్స్ట్రక్షన్స్ సంస్థ తమకు కూలి డబ్బులు చెల్లించడం లేదని...