Green Crackers:గ్రీన్ క్రాకర్స్ నిజంగానే కాలుష్యాన్ని తగ్గిస్తాయా?

దేశ వ్యాప్తంగా పండుగ సందడి మొదలైంది. అయితే మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గాలి నాణ్యత ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, వినియోగానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? ఇవి నిజంగానే పర్యావరణానికి మేలు చేస్తాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సంప్రదాయ బాణసంచాతో పోలిస్తే తక్కువ కాలుష్యం విడుదల చేసేలా CSIR-NEERI శాస్త్రవేత్తలు గ్రీన్ క్రాకర్స్‌ను అభివృద్ధి చేశారు. 2018లో వీటిని...