BRS:ఇది అనావృష్టి కాదు..రేవంత్ వృష్టి, సీఎం తీరుపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణలో ప్రస్తుత కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సమర్థంగా వినియోగించుకోలేకపోవడం వల్లే రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇది అనావృష్టి కాదని.. రేవంత్ రెడ్డి వృష్టి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయిన వరి పంట...