Chandrababu:అధైర్యపడకండి..తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం..ఏపీ సీఎం చంద్రబాబు భరోసా!

మురసు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. తొలుత సూర్యలంక చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడికి బయలుదేరారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న డ్రెయిన్ల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షపు నీరు సక్రమంగా బయటకు...