Warangal Congress:వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డికి ఘన సన్మానం
వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా ఇటీవల నియమితులైన అబ్బిడి రాజిరెడ్డికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అబ్బిడి రాజిరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పార్టీ నాయకులు, మండల, డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఆయనకు ఘన...