CM Revanth Reddy:కొడంగల్‌కు సీఎం రేవంత్..రూ.9,053 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల పాటు నవంబర్ 7, 8, 9 తేదీల్లో కొడంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,053 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. తొలుత నవంబర్ 7న హకీంపేటలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న...