Team India:టీమిండియా బౌలింగ్‌లో కొత్త ఆశలు..గంభీర్ వ్యూహాం ఫలించేనా!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్లు అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇద్దరూ తమ బౌలింగ్‌లో విభిన్న నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ ప్రదర్శనతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్ వన్డే జట్టు ప్రణాళికలపై ఓ స్పష్టత వచ్చినట్లయింది. తొలి వన్డేలో ఎనిమిదో ఓవర్ వేసిన అన్షుల్ కాంబోజ్.. టిమ్ సీఫర్ట్‌కు వరుసగా ఆరు బంతులు వేసినా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. కొన్ని బంతులను సీఫర్ట్ నేరుగా బౌలర్ వైపు...