Supreme Court:అరెస్ట్, నిర్బంధం.. 24 గంటల గడువుపై సుప్రీం కీలక తీర్పు

అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలన్న రాజ్యాంగ నిబంధనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీసులు అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా.. ఒక వ్యక్తిని నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. గురువారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టు, నిర్బంధం మధ్య కృత్రిమమైన వ్యత్యాసాన్ని చూపించడానికి వీల్లేదని పేర్కొంది. అధికారిక అరెస్టుకు...