Sobhita Dhulipala:ఇండస్ట్రీలోకి రావాలంటే భయానకమే..కానీ!

సినీ పరిశ్రమలో ఎలాంటి పరిచయాలు, పలుకుబడి లేకుండా అడుగుపెట్టడం చాలా కష్టమైన అనుభవమని నటి శోభిత ధూళిపాళ వెల్లడించింది. పరిశ్రమలో తనకు మార్గనిర్దేశం చేసేవారు, అండగా నిలిచేవారు ఎవరూ లేరని గుర్తుచేసుకుంది. మోడలింగ్ నేపథ్యం కూడా కొన్ని సందర్భాల్లో తనకు ప్రతికూలంగా మారిందని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శోభిత తన సినీ ప్రయాణంలోని కష్టాలను పంచుకుంది. విశాఖపట్నం నుంచి ముంబైకి వెళ్లిన శోభిత.. చదువుకుంటూనే మోడలింగ్ రంగంలో కొనసాగింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ విజయం ద్వారా ర్యాంప్...