Kesari 2: కరణ్ జోహార్‌పై రెజీనా అసహనం..నార్త్–సౌత్ విభేదాలపై కీలక వ్యాఖ్యలు!
దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటీమణులు జాన్వీ కపూర్, రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపై నటి రెజీనా కాసాండ్రా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య విభేదాలను పెంచేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక సినిమాలో తమ పాత్ర చిత్రీకరణ పట్ల అసౌకర్యంగా భావిస్తే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకునే అవకాశం ఉన్నప్పుడు అలా చేయాలని నటీనటులకు సూచించారు. అంతేకానీ తమకు మరో మార్గం లేదని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. ఒక సినిమాలో తమ పాత్ర పట్ల...