Warangal DCC:పకడ్బందీగా ఎమ్మెల్సీ ఓటరు నమోదు..కాంగ్రెస్ శ్రేణులకు అయూబ్ పిలుపు
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా కాంగ్రెస్ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటరు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై మహమ్మద్ అయూబ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...