Diwali 2026:దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?..ఆసక్తికరమైన కథ!
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి సందర్భంగా ఇళ్లను దీపాలతో అలంకరించి, టపాసులు కాల్చి, దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని కలిపి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవితో పాటు విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. దీపావళి పండుగను శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని, సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారని...