TRS:హిందూ కాలేజీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక హిందూ కాలేజీని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 130 ఏళ్ల చరిత్ర, ఘనమైన వారసత్వం కలిగిన ఈ విద్యాసంస్థ ప్రత్యేకతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. కాలేజీని ప్రైవేటుపరం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత నెలన్నర రోజులుగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలోని హిందూ కాలేజీకి వెళ్లిన కవిత.....