STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 4:09 pm Posted by : ARUN

Team India:విరాట్ కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్‌ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు అద్భుత ప్రదర్శనతో కివీస్‌ను 185 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం విరాట్ కోహ్లీ (74), శుభ్‌మన్ గిల్ (37) రాణించడంతో భారత్ విజయం సాధించింది.

వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆటకు పలుమార్లు అంతరాయం కలిగినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. మరో 56 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కేవలం 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 74 పరుగులు చేసి భారత్ విజయానికి బలమైన పునాది వేశాడు.

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆ నిర్ణయాన్ని సరైనదిగా నిరూపించింది. భారత పేసర్లు ఆరంభం నుంచే కివీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.  తర్వాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కాసేపు భారత బౌలర్లను ఎదుర్కొని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లకు స్వేచ్ఛగా పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా కాంబోజ్ 10 ఓవర్లలో కేవలం 22 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో గత పదేళ్లలో వన్డేల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా సరసన చోటు సంపాదించాడు.

మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. గర్నూర్ బ్రార్ రెండు వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ 160 పరుగులకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే చివర్లో బ్లెయిర్ టిక్నర్ మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 34 పరుగులు చేసి జట్టు స్కోరును 185 పరుగులకు చేర్చాడు.