Tabu:28 ఏళ్ల తర్వాత కింగ్‌తో టబు…బర్త్‌డే సందర్భంగా నాగ్‌ స్పెషల్ సర్‌ప్రైజ్!

అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం ‘కింగ్100’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున కెరీర్‌లో ఇది 100వ సినిమా కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. మరోవైపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి వెండితెరపై కలిసి కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. 1998లో వచ్చిన ‘ఆవిడా మా ఆవిడే’ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. తాజాగా టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను నాగార్జున విడుదల చేశారు. ఈ చిత్రంలో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే...