Sachin Tendulkar:సచిన్‌కు ఇష్టమైన కెప్టెన్లు ఎవరో తెలుసా?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎంతోమంది గొప్ప కెప్టెన్ల నాయకత్వంలో ఆడారు. భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు సచిన్. అయితే కెప్టెన్‌గా అంతగా రాణించలేకపోయిన సచిన్.. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ సారథ్యంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన కెప్టెన్లు ఎవరో సచిన్ వెల్లడించారు. రెడ్డిట్ వేదికగా ఓ అభిమాని సచిన్‌ను పలు ప్రశ్నలు అడిగారు. భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఎలా ఉంది? ఆ బాధ్యతలకు అలవాటు పడటం...