Jaipur:మెడికల్ కాలేజీలో పడగవిప్పిన ర్యాగింగ్ భూతం..లైంగిక వేధింపులు! 

రాజస్థాన్‌లోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చురులోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. జూనియర్ విద్యార్థులను లైంగికంగా అవమానించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కళాశాల యాజమాన్యాన్ని తక్షణమే చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కళాశాల ప్రిన్సిపల్, డీన్‌ను సంప్రదించిన ఎన్‌ఎంసీ.. ఫిర్యాదులోని ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ ప్రారంభం నుంచి రాజస్థాన్‌లోని మెడికల్ కాలేజీల్లో నమోదైన ర్యాగింగ్...