Kavitha:తెలంగాణ నీటి హక్కులు ఏపీకి తాకట్టు..రేవంత్‌ సర్కార్‌పై కవిత ఫైర్

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం ద్వారా తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత  విమర్శించారు. గోదావరి నదిలో తెలంగాణకు దక్కాల్సిన 250 టీఎంసీల నీటి వాటాను తన రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ రెడ్డి సమర్పించుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో...