ICC Test Rankings:మళ్లీ అగ్రస్థానానికి మిచెల్ స్టార్క్.. జాన్సన్‌కు రెండో స్థానం!
ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు అనంతరం ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టగా.. జాన్సన్ మూడు వికెట్లు మాత్రమే తీశాడు. కేప్‌టౌన్ టెస్టులో ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో...