Bhagavadgita: భగవద్గీత ప్రకారం మరణం అంటే ఏంటి? ..శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలివే!
మరణం అనేది ప్రతి జీవికి తప్పనిసరిగా ఎదురయ్యే సహజమైన ప్రక్రియ. అయితే మరణం అంటే జీవితానికి ముగింపు కాదని భగవద్గీత వివరిస్తుంది. శరీరం నశించినప్పటికీ ఆత్మకు మరణం లేదని అది ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని శ్రీకృష్ణుడు బోధించాడు. భగవద్గీతలోని పలు శ్లోకాలు జననం, మరణం, ఆత్మ శాశ్వతత్వం గురించి లోతైన విషయాలను తెలియజేస్తాయి. భగవద్గీత రెండో అధ్యాయం 27వ శ్లోకంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణించిన వారికి తిరిగి జన్మించడం కూడా సహజమని వివరించాడు. తప్పనిసరిగా...