STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 5:34 pm Posted by : ARUN

TRS:టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం..విశేష స్పందన

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.

ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విజ్ఞప్తికి ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించారు. కవిత విజ్ఞప్తి మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు దరఖాస్తు గడువు పెంచింది ఎన్నికల సంఘం.

కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో నామినేషన్ల చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

నవంబర్ 2న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడగించాలని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కవిత బృందం కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నవంబర్ 21 వరకు కొనసాగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువును కూడా పొడిగించాలని కోరగా ఎన్నికల అధికారులు సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు.