Supreme Court:రామ్‌లీలా మైదాన్ నిరసనలపై సుప్రీం..నిరసనల పేరుతో ఆక్రమణలా అంటూ ప్రశ్న?

నిరసనల పేరుతో ఒక ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని అయితే అందుకు నిర్దిష్ట సమయం, గడువు ఉండాలని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్, రామ్‌లీలా మైదాన్‌లో ఇటీవల నిర్వహించిన ఆందోళనలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పండుగల సమయంలో సీఈసీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనలను నిలిపివేయాలని కోరుతూ వ్యాపార సంఘాలు దాఖలు చేసిన...