ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి:
• రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్! సదాశివపేట : రైతులకు సేవలు అందించాల్సిన ఒక ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. సదాశివపేట మండలంలో ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ మంజూరు ప్రక్రియ కోసం బాధిత వ్యాపారి నుంచి మండల వ్యవసాయ అధికారి రమేష్ రూ.30 వేలు లంచం డిమాండ్...