బాలీవుడ్ నటి రాధికా ఆప్టే…నటుడు బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ రాధికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
బాలయ్యతో ఆమె లెజెండ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ సినిమా పేరు ప్రస్తావించకుండానే ఓ తెలుగు సినిమాలో తనకంటే వయసులో చాలా పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా కథలో తన పాత్రకు మేనమామతో వివాహం జరిగే పరిస్థితి ఉంటుందని, సినిమా మధ్యలోనే తన పాత్ర చనిపోతుందని వివరించారు. ఆ సినిమాలోని కథాంశం తనకు ఏమాత్రం నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ బాలయ్య బాబు గురించేనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోండగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథ, హీరో గురించి ముందుగానే తెలుసుకుని నటించేందుకు అంగీకరించిన తర్వాత ఇప్పుడు విమర్శలు చేయడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. అంతేగాదు లెజెండ్ తర్వాత మరో సినిమాలోనూ బాలకృష్ణతో నటించిందని చురకలు అంటిస్తున్నారు. మొత్తంగా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.