PJR ఇండోర్ స్టేడియంలో ‘కలరిపయట్టు’ పోటీల ఏర్పాట్లు పరిశీలన
చందానగర్ : రాబోయే ప్రతిష్టాత్మక 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' నేషనల్ ఫైనల్స్ కలరిపయట్టు పోటీలకు వేదిక కానున్న చందానగర్‌లోని పీజేఆర్ (PJR) ఇండోర్ స్టేడియంను సోమవారం పలువురు ప్రముఖ క్రీడాధికారులు, సాంకేతిక నిపుణులు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్శనలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ డాక్టర్ G.V. సుబ్బారావు, ఇండియన్ కలరిపయట్టు ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ కమిటీ సభ్యులు P.E. శ్రీజయన్ గురుక్కల్, టెక్నికల్ కమిటీ సభ్యులు అంబరీష్ గురుక్కల్లతో పాటు కలరిపయట్టు అసోసియేషన్ ఆఫ్...