TRS:కొడంగల్‌లో కవిత పార్టీకి పెరుగుతున్న ఆదరణ.. రేవంత్‌కు ప్రత్యామ్నాయంగా రాజప్రభాకర్!

తెలంగాణ రాజకీయాల్లో కొడంగల్ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) క్రమంగా తన రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల కోస్గిలో నిర్వహించిన 'పాంచజన్య సంకల్ప సభ'కు వచ్చిన స్పందన స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ సభ విజయవంతం కావడంలో కొడంగల్ పార్టీ ఇన్‌ఛార్జి రాజప్రభాకర్ కీలకంగా వ్యవహరించారు. స్థానికుడిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా రాజప్రభాకర్ రావుకు నియోజకవర్గంలో మంచి...