UNO:పాకిస్తాన్‌కు షాకిచ్చిన భారత్..ఎందుకో తెలుసా?
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో పాకిస్థాన్‌కు భారత్, ఇజ్రాయెల్ గట్టి షాక్ ఇచ్చాయి. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిల్లో సాంప్రదాయ ఆయుధాల నియంత్రణకు సంబంధించి పాకిస్థాన్, బెలారస్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఆయా దేశాల భద్రతా ఆందోళనలను కేవలం ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం చేయలేమని భారత్ స్పష్టం చేసింది. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిల్లో సంప్రదాయ ఆయుధాల నియంత్రణ పేరుతో ఈ తీర్మానాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ మొదటి కమిటీ ముందు ప్రవేశపెట్టారు. ఓటింగ్‌లో 180 దేశాలు తీర్మానానికి అనుకూలంగా...