ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అక్రమ మద్యం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
వైసీపీ హయాంలో చోటుచేసుకున్న మద్యం అక్రమాల ఆరోపణలపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, మద్యం సరఫరా, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకు నోటీసులు పంపింది ఈడీ.
ఈడీ విచారణలో భాగంగా మద్యం వ్యవహారంతో ఆయనకు ఉన్న సంబంధాలు, సంబంధిత వ్యక్తులతో జరిగిన లావాదేవీలు, ఇతర కీలక అంశాలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే అంబటి రాంబాబును ఏ అంశాలపై విచారించనున్నారనే దానిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఈడీ నోటీసుల నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ నెల 4న హైదరాబాద్లో విచారణకు హాజరుకానున్నారు. ఆయన విచారణకు హాజరైన తర్వాత ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఎలా సాగుతుంది? మరికొందరికి కూడా నోటీసులు జారీ అవుతాయా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
