Cyber Crime:ట్రేడింగ్ పేరుతో కానిస్టేబుల్‌కు టోకరా..ఏకంగా రూ.29.20 లక్షలు ఫట్!

హైదరాబాద్:సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను నిండా ముంచేశారు సైబర్ కేటుగాళ్లు. అధిక లాభాల ఆశ చూపించి విడతలవారీగా రూ.29.20 లక్షలు పెట్టుబడులు పెట్టించింది. చివరకు లాభాలు, పెట్టుబడి సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.12 లక్షలు చెల్లించాలని చెప్పడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్‌లో ‘సుకన్య రెడ్డి’ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది....