Congress:అధికారంలో ఉన్నా అసంతృప్తే..టీకాంగ్రెస్‌లో ముసలం..ఎవ్వరూ తగ్గేదేలే?

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయా?.. సొంత పార్టీలోనే అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయా? ...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కొందరు మంత్రులు గుర్రుగా ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మొన్న కొండా సురేఖ.. నేడు దామోదర రాజనర్సింహ.. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వంతు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తమకు అనుకూలంగా లేని మంత్రులను మీడియా కథనాల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ సీనియర్ నేత లక్ష్మీకాంతరావు మధ్య...