AP Muncipal Results:మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా..టీడీపీ గాలిలోనూ నందికొట్కూరులో బైరెడ్డి సత్తా
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించిన 1,959 వార్డుల్లో కూటమి ఏకంగా 1,743 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 1,438 వార్డుల్లో విజయం సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది. జనసేన పార్టీ 222, బీజేపీ 83 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 188 వార్డుల్లో విజయం సాధించగా, వామపక్షాలు ఆరు, స్వతంత్ర అభ్యర్థులు 22 స్థానాలను దక్కించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10...