సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..

• కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సాదర ఆహ్వానం!   హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరుకావాల్సిందిగా కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆమె స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ రిసెప్షన్ వేడుక వచ్చే నెల డిసెంబర్...