STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 5:10 pm Posted by : ARUN

ఎమ్మెల్సీ ఎన్నికలు..TRS అభ్యర్థులు వీరే

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు స్థానాల్లో బీసీలకే అవకాశం కల్పించారు కవిత.

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరు, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి నలమాస శ్రీకాంత్ గౌడ్ అభ్యర్థులుగా ప్రకటించారు. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, విద్యారంగ అభివృద్ధి, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు రావాలని బీసీ వర్గాలకు పెద్దపీట వేశామని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు గొగికర్ నవీన్ కుమార్ తెలిపారు.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారడం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి రావడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన రోడ్లు, మెరుగైన పారిశుధ్యం, నిరంతర తాగునీటి సరఫరా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.