రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్..బాలికకు జగన్ పరామర్శ

అనంతపురం జిల్లా రాప్తాడులో హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిల్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులు, వైద్య నివేదికలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిశీలించాలని కోరారు. బాధితుడు హేమంత్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు....