STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:44 pm Posted by : AMAR

మురసు తీవ్ర తుఫాన్ ముప్పు.. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న పెను తుఫాన్!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘మురసు’ తీవ్ర తుఫాన్ (Severe Cyclonic Storm) వణికిస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుఫాన్ ప్రసుత్తం ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 80 కి.మీ., కావలికి 80 కి.మీ. మరియు ఒంగోలుకు 110 కిلوమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు ఒంగోలు సమీపంలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలి తీవ్రత గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉంది.

ఉప్పెన ముప్పు.. జిల్లాలకు రెడ్ అలర్ట్

బాపట్ల, కృష్ణా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ఉప్పెన (Storm Surge) వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ప్రభావంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం మరియు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సహాయక చర్యల కోసం యంత్రాంగం సిద్ధంగా ఉంది.