ఐపీఎల్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఐపీఎల్ పై మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏప్రిల్-మే నెలల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్‌ను జనవరి నుంచి ప్రారంభించేలా మార్పులు చేయాలని సూచించారు. అంతేకాకుండా టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై ఐసీసీ చైర్మన్ జై షా చొరవ తీసుకుని అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో అవసరమైన మార్పులకు సహకరించాలని కోరారు. జనవరిలో టోర్నీని ప్రారంభించడం కూడా ఈ ప్రతిపాదనలో భాగమేనని వివరించారు. అయితే ఏడు నెలల పాటు నిరంతరాయంగా ఐపీఎల్ నిర్వహించాలని తాను కోరడం లేదని...