Kavitha:గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు పొడగించాలి

తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని కోరగా ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నవంబర్ 6తో ముగియనున్న ఓటరు నమోదు గడువును ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ ఆలోచనలతో, వివేచనతో ఓటు వేస్తారని కవిత అన్నారు. ఇలాంటి ఎన్నికలు కొత్త రాజకీయ పార్టీలకు తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు....