హార్ముజ్ జలసంధిని తెరుస్తాం కానీ..ఇరాన్ షరతు!

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ డిమాండ్లకు అంగీకరిస్తే మరో రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. ఈ విషయంలో తుది నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా ఇరాన్, అమెరికా పరస్పరం సందేశాలు పంపుకుంటున్నాయని బఘాయీ తెలిపారు. ఇరాన్ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తుందా లేదా అన్నదానిపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు....