నిరసనల్లో పాల్గొనే హక్కు లేదు..ఇమ్రాన్‌పై బాంబే హైకోర్టు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు ఉన్నంత మాత్రాన భారత్‌లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదని తేల్చిచెప్పింది న్యాయస్థానం. మరో దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇప్పటికే దేశం నుంచి బహిష్కరించి ఉండేవారని వ్యాఖ్యానించింది. విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) జారీ చేసిన లీవ్ ఇండియా నోటీసును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం...