అర్నబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతుందా?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్నబ్ తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అక్టోబర్ 26 అర్ధరాత్రి సమయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారి, అక్టోబర్ 27న అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 28 ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను కదలికలు, తీవ్రతలో మార్పులను బట్టి తీరం దాటే...