TRS: కులకర్ణి రాజప్రభాకర్ రావు పరామర్శ
TRS: నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి చెందిన తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకర్త క్రాంతి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు సోమవారం ఉదయం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలకు కష్టసమయాల్లో అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజప్రభాకర్ రావు స్వయంగా క్రాంతి ఇంటికి వెళ్లి పరామర్శించడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.