STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 12:36 pm Posted by : START TRINETHRAM

Rajaprabhakar Rao: నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి (VIDEO)

Rajaprabhakar Rao: నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కొడంగల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ రాజ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటల సాగుకు అవసరమైన నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ముందస్తుగా విద్యుత్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

నారాయణపేట-కొడంగల్ సాగునీటి ప్రాజెక్టు ప్రక్రియలో భాగంగా ఎకరాకు రూ.40 లక్షల విలువైన భూమికి రూ.25.20 లక్షలు మాత్రమే చెల్లించి రైతుల భూములను తీసుకోవడం వల్ల వారికి ఆర్థిక నష్టం జరుగుతోందని రాజ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని, కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయ రంగాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ALSO READ: TRS: కులకర్ణి రాజప్రభాకర్ రావు పరామర్శ