మనుషుల వేలిముద్రలను పోలిన కోలాల ముద్రలు.. ప్రకృతి వింత ఇదే!
వేలిముద్రలు ప్రతి మనిషికీ ప్రత్యేకమైన గుర్తింపును అందిస్తాయి. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు పూర్తిగా ఒకేలా ఉండవని మనకు తెలుసు. అయితే మనుషులకు దూరపు సంబంధం కూడా లేని ఓ జంతువు వేలికొనలపై అచ్చం మానవ వేలిముద్రలను పోలిన గీతలు ఉంటాయని తెలుసా? ఆ వింత జీవి ఆస్ట్రేలియాలో కనిపించే కోలా. గుండ్రటి ముక్కు, పెద్ద చెవులు, దట్టమైన బొచ్చుతో ఆకట్టుకునే ఈ మార్సుపియల్ జంతువు వేళ్లపై ఉండే గీతలు, వలయాలు మానవ వేలిముద్రలను పోలి ఉంటాయి. అందుకే కోలాల వేలిముద్రలు శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్...