36 గంటల బ్యాటరీతో OnePlus Buds Clip.. ఫీచర్లతో ఆకట్టుకునే కొత్త ఇయర్‌బడ్స్!

ఓపెన్ ఇయర్ డిజైన్‌తో రూపొందించిన ఇయర్‌బడ్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో OnePlus Buds Clip ప్రత్యేకంగా నిలుస్తోంది. చెవులను పూర్తిగా మూసివేయకుండా సంగీతాన్ని వినేలా రూపొందించిన ఈ ఇయర్‌బడ్స్‌లో ఆడియో నాణ్యత, కాల్స్‌ స్పష్టత, బ్యాటరీ సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరాలు సూచిస్తున్నాయి. ఒక్కసారి ఛార్జ్‌తో ఇయర్‌బడ్స్‌ 8 గంటల వరకు, ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 36 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తాయని పేర్కొన్నారు. అయితే, భారత మార్కెట్‌లో విడుదల తేదీ, ధర, లభ్యతకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడైన తర్వాతే...