STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 3:38 pm Posted by : START TRINETHRAM

Narayanpet: రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన మహా ధర్నా

  • నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
  • నష్టపోయిన రైతులను గుర్తించాలి
  • వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్

Narayanpet: నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్లతో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో 26-10-2026, సోమవారం మహా ధర్నా నిర్వహించనున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ ఇంఛార్జ్ గవినోళ్ల శ్రీనివాస్, కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజ ప్రభాకర్ రావు, మక్తల్ నియోజకవర్గ ఇంఛార్జ్ సి.హెచ్.వెంకన్నల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటలకు నారాయణపేటలోని వివేకానంద పార్క్ సమీపంలో ధర్నా చేపట్టనున్నారు.

జిల్లాలో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను గుర్తించి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి అర్హులైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, రైతుల రుణాల విషయంలో తగిన ఉపశమనం కల్పించి అప్పుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ALSO READ: Kulkarni Rajaprabhakar Rao: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు